ఈ చలికాలంలో మిగతా సీజన్ల కన్నా చర్మం ఎక్కువగా నల్లగా మారుతుంటుంది. ముఖ్యంగా మోచేతులు నల్లగా మారుతుంటాయి. కొంతమందికి శరీరం అంతా తెల్లగా వున్నా, మోచేతులు, మోకాళ్ళు మరీ నల్లగా ఉంటాయి. అలాంటి వారు, వాటిని తగ్గించుకోవడం కోసం తరచూ పార్లర్‌ కు వెళ్తుంటారు.కానీ ఈ సమస్యలను మన ఇంట్లో దొరికే వస్తువులతోనే పరిష్కరించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

1).కలబందతో..
కలబందతో మోచేతులపై  ఉన్న నలుపును సులభంగా పోగొట్టుకోవచ్చు.నలుపు తగ్గించుకోవడం కోసం,రెండు స్ఫూన్ లా కలబంద గుజ్జును తీసుకొని, అందులో ఒక స్ఫూన్ పసుపు వేసి బాగా కలిపి నల్లగా ఉన్న మోచేతులకు, మోకాళ్లకు మసాజ్ చేసుకోవాలి.తర్వాత అరగంట పాటు బాగా ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరుచుగా చేస్తూఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కలబందలో ఉన్న పోషకాలు చర్మాన్ని  మృదువుగా తయారుచేయడంలో సహాయపడతాయి.

2).చక్కెర..
కొంతమందికి మోచేతులు మరీ నల్లగా ఉంటాయి. అలాంటి వారు చక్కెర ఒక స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.దీనికోసం ఒక స్పూన్‌ ఆలివ్ నూనె తీసుకొని, అందులో కొంచెం చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రాసుకొని, బాగా మర్దన చేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.ఆలివ్ నూనె చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది.

3).నిమ్మరసం..
నిమ్మరసం మృతకణాలను సమర్థంగా తొలగించే క్లేన్సర్ లా పనిచేస్తుంది.దీనికోసం నిమ్మకాయను తీసుకొని, కట్ చేసి,అ ముక్క తో కాఫీ పౌడర్ అద్దుతూ, మోచేతులపై మృదువుగా రుద్ది, ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4).పెరుగు..
నలుపుదనం తగ్గించుకోవడం కోసం రెండు స్పూన్ల పెరుగు తీసుకొని,కొద్దిగా వైట్‌ వెనిగర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మోచేతులకు, మోకాళ్లకు మృదువుగా మసాజ్ చేసుకోవాలి.ఇది అరగంట పాటు ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అ తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల నలుపుదనం తొందరగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: