
జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్యాట్లను కలిగి ఉంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు తక్కువ అవుతాయి. అలాగే ఇందులో ఉండే మినరల్స్ ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఎముకల బలహీనతను నివారించడంలో జీడిపప్పు సహాయకారి.
ఇంకా జీడిపప్పులో ఉండే కొవ్వుల సమ్మేళనం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. విద్యార్థులు, మానసిక ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు ఇది ఉపయోగకరం. జీడిపప్పును రాత్రి ముందు నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. అయితే, ఇది అధికంగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 4–5 జీడిపప్పులు సరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే బరువు పెరగడం, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. జీడిపప్పును సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిత్యం మితంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జీడిపప్పులో జింక్, విటమిన్ E వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) పెంచుతాయి. అలాగే జీడిపప్పులో ఉండే జింక్, సిలీనియం వంటి ఖనిజాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి, జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటగా అనిపించకుండ ఉత్సహంగా ఉండేలా చేస్తాయి. సరైన మోతాదులో తీసుకుంటే జీడిపప్పులోని ఫైబర్ తృప్తిని కలిగిస్తుంది. ఎక్కువ తినే అలవాటు తగ్గుతుంది, తద్వారా బరువు నియంత్రించవచ్చు.