
నల్లగా కనిపించే మచ్చలు బ్లాక్ మోల్డ్ అనే ఫంగస్ వల్ల రావచ్చు. ఇది Aspergillus niger అనే ఫంగస్ వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా నిల్వ చేయడం సరిగా లేకపోతే వస్తుంది .ఊదా రంగు పొడి లేదా నల్ల బురదలా కనిపిస్తుంది. ఈ రకమైన ఫంగస్ మట్టిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది . ముఖ్యంగా తడితో కూడిన వాతావరణం లో తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఈ విధంగా ఉల్లిపాయలను నిలువ చేస్తే వాటిపై ఈ Aspergillus niger అనే ఫంగస్ కనిపిస్తుంది . ఇది చాలా సర్వసాధారణం . ఈ ఫంగస్ ఆందోళనకరణం కాదు. అయితే కొన్ని కొన్ని సార్లు అలా ఫంగస్ ఉన్న ఉల్లిపాయలను తినడం ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు.
ఉల్లిపాయలపై ఉన్న ఈ నల్లటి మచ్చలు న్యూక్కోర్మైకోసిస్ కాదు. కనుక ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వాళ్ళు ఈ ఉల్లిపాయలను శుభ్రంగా కడుక్కొని ఉప్పులో.. పసుపులో నానబెట్టిన నీళ్లతో వాష్ చేసుకుని కూరలకు ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి ఉల్లిపాయలను వండడానికి ముందు తొక్క తీసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి అని గుతుంచుకోవాలి. అంతే కాదు అలా శుభ్రంగా ఉప్పు పసుపు నీళ్లతో కడిగిన ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు అంటూ అధ్యయనలు సూచిస్తున్నాయి . అయితే ఈ బ్లాక్ అచ్చు ఒక రకమైన టాక్సిక్ ను విడుదల చేస్తుంది అంటూ పరిశోధనలో తేలింది. ప్రాణాపాయం కానప్పటికీ వీటిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ..ఉబ్బసం లేదా గర్భిణీ స్త్రీలు లేదా శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు ..ఇలాంటి ఉల్లిపాయలు తినకపోవడం మంచిది అంటున్నారు డాక్టర్లు. మరీ ముఖ్యంగా అలర్జీ ఉన్నవారు ఇలాంటి ఉల్లిపాయలు తినకపోవడం మరింత మంచిది అంటున్నారు డాక్టర్లు..!!