
వామును కొద్దిగా వేయించి తినడం లేదా వేడి నీటితో కలిపి తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. వాములో యాంటీ ఫ్లాట్యూలెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి గ్యాస్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్ ఏర్పడకుండా నివారిస్తుంది. అల్లం టీ లేదా అల్లం ముక్కను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం పేగుల్లో గ్యాస్ పేరుకుపోకుండా సహాయపడుతుంది.
ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. ఎక్కువగా కార్బోనేటెడ్ పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి. ఎక్కువగా నీరు తాగడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల గ్యాస్ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు