మీరు పోస్టాఫీస్‌లో డబ్బులు పెట్టుబ‌డి పెట్టాల‌ని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక ప‌థ‌కం అందుబాటులోకి వ‌చ్చింది. అదే రికరింగ్ డిపాజిట్ పథకం. ఇందులో ప్రతి నెలా డబ్బులు పెట్టుబ‌డి పెడుతుండాలి. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి డబ్బులు వస్తాయి. ఆ వ‌చ్చే డ‌బ్బులు చూసి మ‌న‌కు ఎంతో సంతోష‌మేస్తుంది. మ‌న భార‌త త‌పాలాశాఖ ఎన్నో ర‌క‌తాల ప‌థ‌కాల‌ను అందిస్తోంది. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ బాగుంటుంది. ఆకర్షణీయమైన‌ రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో ప్రతి నెలా కొంత డబ్బులు మ‌నం డిపాజిట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. మ‌నం ఎన్ని సంవ‌త్స‌రాలు పెట్టుకుంటే అన్ని సంవ‌త్స‌రాలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఎటువంటి రిస్క్ ఉండ‌దు
ఈ ప‌థ‌కంలో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబ‌డి ఉంటుంది. కనీసం రూ.100తో కూడా పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. నెల‌నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళితే.. కొంత కాలం తర్వాత పెట్టిన డబ్బుతోపాటు వడ్డీ వ‌స్తుంది. ఆర్‌డీ ఖాతా మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మీరు అవసరమ‌నుకుంటే ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. మీరు ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు ఆర్‌డీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.  మూడు నెలలకు ఒకసారి మారుతూ రావొచ్చు.

నెల‌కు రూ.5 వేలు పెట్టుబ‌డి పెడితే..
ఉదాహరణకు మీరు నెలకు రూ.5 వేలు పోస్టాఫీస్ ర‌క‌రింగ్ డిపాజిట్ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టార‌ని అనుకుందాం. ఇలా మీరు పదేళ్లు డిపాజిట్ చేస్తూ వెళ్లారు. అప్పుడు మీరు పెట్టుబ‌డి పెట్టిన‌ డబ్బులు రూ.8 లక్షల‌వుతాయి. మెచ్యూరిటీ కాలంలో రూ.8.14 లక్షలు వస్తాయి. ఇక్కడ వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది. ఒక్కోసారి కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్డీరేట్ల‌ను స‌వ‌రిస్తుంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ఆధారంగా చేసుకొని వడ్డీరేట్ల‌ను పెంచుతుంటే మ‌నకొచ్చే ఆదాయం కూడా పెరుగుతుంటుంది. ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు కూడా పోస్టాఫీసులో పెట్టుబ‌డి పెట్ట‌డానికి సిద్ధం కండి.. ల‌క్షాధికారుల‌వ్వండి!.



మరింత సమాచారం తెలుసుకోండి: