పోస్ట్ ఆఫీసులు ముఖ్యంగా అట్టడుగు పేదల కోసం ఒక సరికొత్త స్కీం ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అదే అటల్ పెన్షన్ యోజన పథకం. ఇందులో కనీసం రోజుకు ఏడు రూపాయలు చొప్పున అంటే , నెలకు 210 రూపాయలను ఈ పథకంలో పొదుపు చేయడం వల్ల, ఏడాదికి 60 వేల రూపాయలను పొందవచ్చు. ఇక ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అందుకే ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో చేరి ప్రతి నెల డబ్బులు పొదుపు చేయడం వల్ల , రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెల కచ్చితంగా ఫిక్స్డ్ పెన్షన్ పొందవచ్చు.

2015 లోనే ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని, అట్టడుగు వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఇందులో ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఇందులో 18 సంవత్సరాల వయసు కలిగిన వారి నుంచి, 40 సంవత్సరాల వయసు కలిగిన వారి వరకు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అయితే ఈ స్కీమ్ లో ఎప్పుడు జమ చేసినా సరే, 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందులో కనిష్టంగా 42  రూపాయలకు పొదుపు చేయవచ్చు. ఇక గరిష్టంగా 1,484 రూపాయల వరకు పొదుపు చేసే అవకాశం  ఉంటుంది.

ఇక ఇందులో మీరు ప్రతి నెల పొదుపు చేసే  ప్రాతిపదికన మీద , మీకు 60 సంవత్సరాల తర్వాత వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఇక ఇందులో రూ.1000 నుంచి రూ.5000 వరకు ప్రతి నెల పెన్షన్ కింద పొందవచ్చు. ఇక అందుకోసమే మీరు నెలకు 210  రూపాయలను పొదుపు చేయడం వల్ల ,ప్రతినెల ఐదువేల రూపాయలను పొందవచ్చు. అంటే సంవత్సరానికి రూ.60,000 పొందవచ్చు అన్నమాట. ఇందులో మీరు నెలనెలా తప్పకుండా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరునెలలపాటు డబ్బులు కట్టలేకపోతే ఈ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ. సంవత్సరం పాటు మనకు గడువు ఇస్తారు. ఇక ఆ సంవత్సరం మన అకౌంట్లో డబ్బులు వేయలేకపోతే  అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.ఇక  రెండు సంవత్సరాల తర్వాత అకౌంట్ క్లోజ్ చేసే ప్రమాదం కూడా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: