టెక్స్ టైల్ పరిశ్రమకు ఈసారి బ్యాడ్ న్యూస్ తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో వస్త్రాలపై ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి పెంచినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలియజేయడం జరిగింది. ఇదివరకు వస్త్రాలపై కేవలం 5 % వరకు మాత్రమే ఉండేదట.. ఇప్పుడు దీనిని 12 % పెంచామని తెలియజేశారు. అయితే వీటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది.. ఈ పెంపుపై సామాన్య ప్రజలపై అదనంగా 7 శాతం భారం మోపడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ట్రేడర్లు తెలియజేయడం జరిగింది.

ఇక వీటికి తగ్గట్టుగా ట్రేడర్ల క్యాపిటల్స్ బ్లాక్ కావడం జరుగుతుందని ఈ ప్రభావం వ్యాపారాలపై చూపుతుందని ట్రేడర్లు తెలియజేస్తున్నారు. దీంతో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్రేడర్స్ నేషనల్ ప్రెసిడెంట్ బిసి భార్టియా, ప్రవీణ్ ఖండేల్వాల్ తెలియజేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా వస్త్రాలపై అసలు ఎలాంటి పన్నులు లేదన్నారు. ప్రస్తుతం టెక్స్ టైల్ ఇండస్ట్రీని జీఎస్టీ కిందికి తీసుకు రావడం వల్ల వీటి పై భారీ దెబ్బ పడింది అని తెలియజేశారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టెక్స్ టైల్ పై ఉన్న 5% జీఎస్టీ రేటును అలాగే ఉంచాలని మంత్రుల శాఖలను కూడా కోరడం జరిగింది. ఈ విషయాన్ని నిర్మల సీతారామన్ కు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు తెలియజేశారు. వీటిని పెంచడం వల్ల చిన్న వ్యాపారుల పై వీటి ప్రభావం ఎక్కువగా చూపుతుందని.. పన్నులు ఎగ్గొడుతున్న  చట్టాల నుంచి తప్పించుకునేందుకు పలు అక్రమ రవాణాలు చేస్తారని టెక్స్ టైల్ శాఖ కేంద్ర మంత్రి  పీయూష్ గోయల్ తెలియజేశారు.

ఇలా పన్ను రేట్లు పెంచడం వల్ల దేశ వాణిజ్య దెబ్బతినడమే కాకుండా దిగుమతులపై కూడా వీటి ప్రభావం చూపుతోందని తెలియజేశారు. పెంచిన ఈ జీఎస్టీ రేటును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నారు వస్త్ర వ్యాపారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: