ఇటీవల కాలంలో చాలా మంది ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరొకవైపు ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు.  ఎందుకంటే నెల వచ్చేసరికి చాలీచాలని జీతంతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, హాస్పిటల్ ఇలా ప్రతీ దానికి ప్రతి ఒక్కరికి డబ్బు ఖర్చు అవుతోంది . ఇక భవిష్యత్ తరాల కోసం దాచి పెట్టడానికి కూడా మిగలడం లేదు అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోయాయి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడు ఏదో రకంగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే అందుకోసం ఉద్యోగాన్ని వదిలేయకుండా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈ వ్యాపారాన్ని చేపట్టవచ్చు.

అదే కూరగాయల వ్యాపారం.. మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అందులో ఈ కూరగాయలు పండించవచ్చు. ఒకవేళ చుట్టుపక్కల స్థలం లేదు అని అనుకుంటే ఇటీవల కాలంలో పట్టణాలలో ఎక్కువగా ఇంటి మిద్దె పైన కూరగాయలు పండిస్తున్నారు. ఇక మీ మిద్దె పైన చిన్న చిన్న కుండీలను ఏర్పాటు చేసి అందులో ముల్లంగి, క్యారెట్, పాలకూర, తోటకూర ,గోంగూర, టమాటా, పచ్చిమిర్చి వంటి కూరగాయలు పెంచవచ్చు. ఆర్గానిక్ పద్ధతుల ద్వారా ఈ కూరగాయల పెంపకాన్ని మీరు చేపట్టినట్లు అయితే రెండు రకాలుగా మీకు లాభాలు వస్తాయి.

ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలు ధరలు కొంచెం ఎక్కువగా ఉండడంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పైగా కూరగాయల ఖర్చు కూడా మిగులుతుంది. ఇకపోతే ఇప్పటికే చాలా మంది ఉదయం పూట ఉద్యోగం చేయడం.. సాయంత్రం పూట ఇలా కూరగాయల సాగు చేయడం లాంటివి చేస్తున్నారు.ఇక  డబ్బు రావడమే కాకుండా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఇక అధికంగా డబ్బు వచ్చినప్పుడే కదా ఇంటిల్లిపాది కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు.. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే మీ ఉద్యోగం వదిలేయకుండా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసి మంచి లాభం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: