ప్రస్తుతం చాలామంది యువత ఎక్కువగా వ్యవసాయం చేయడానికి ముగ్గు చూపుతున్నారు . ఎందుకంటే వ్యవసాయంలో అత్యధిక టెక్నాలజీని ఉపయోగించి మంచి లాభార్జన పొందుతున్న నేపథ్యంలో ఇలా చాలామంది వ్యవసాయం వైపు అడుగులు వేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక మసాలా దినుసు సాగు చేస్తే ఖచ్చితంగా మీరు లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో మిరియాల కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర దేశాల్లో కూడా భారీగా ధర పలుకుతున్న నేపథ్యంలో మేఘాలయకు చెందిన నానాద్రో బి.మారక్ అనే ఒక రైతు మిరియాల పండిస్తూ భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఆయన ఐదు ఎకరాల భూమిలో మిరియాల సాగు చేస్తూ మంచి విజయాన్ని చూడడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారంని కూడా సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇక ఈయన కరిముండా రకానికి చెందిన మిరియాలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పంట సాగుకు క్రిమిసంహారక , రసాయనక ఎరువులను ఉపయోగించకుండా సేంద్రియ ఎరువుల సహాయంతో పంటను పండిస్తున్నారు . ఇక తొలిదశలో పదివేల ఖర్చు చేసి పదివేల మిరియాల మొక్కలను నాటారు. తర్వాత క్రమంగా పంటను విస్తరిస్తూ ఇక వీరు పండించే మిరియాలు మంచి నాణ్యతవి కావడంతో ప్రపంచవ్యాప్తంగా వీరికి బాగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఎవరైనా ఈ ప్రాంతానికి వెళ్తే నల్ల మిరియాల పంట సుగంధ ద్రవ్యాల సువాసన వారికక్కడ స్వాగతం పలుకుతుంది.

ఇక ఈయన ఎంతోమందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా పంటకు సంబంధించిన అన్ని వివరాలను కూడా వెల్లడిస్తున్నారు. 2019లో రూ.19 లక్షల విలువైన మిర్యాలను ఉత్పత్తి చేశాడట. ఇక ప్రస్తుతం కొన్ని లక్షల రూపాయలను మిరియాల సాగు ద్వారా పొందుతున్నట్లు తెలిపాడు .ఇక అంతే కాదు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. ఇక మీరు కూడా ఇలాంటి అధునాతనమైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మంచి లాభాలను పొందడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: