ప్రస్తుత కాలంలో మళ్లీ కరోనా విజృంభించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది బయటకు వెళ్లాలంటేనే మళ్లీ భయపడిపోతున్నారు. అందుకే సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే వ్యవసాయం.. గతంలో పెద్దలు మాత్రమే వ్యవసాయం చేసేవారు. కానీ అత్యధిక పద్ధతులను అవలంబిస్తూ ఇంజనీర్లు, డాక్టర్లు కూడా వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పంటలు పండిస్తూ లక్షల రూపాయలను వెనకేసుకుంటున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా ని తీసుకురావడం జరిగింది అదే డ్రాగన్ ఫ్రూట్ సాగు..

ఈ సాగు ద్వారా మీకు అరకోటికి పైగా ఆదాయం వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. తొలి దశలో సాగుకు రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.  డ్రాగన్ ఫ్రూట్ సీజన్లో కనీసం మూడుసార్లు పండ్లను ఇస్తుంది. ఒక పండు సాధారణంగా 400 గ్రాముల బరువు ఉంటుంద.  అంతేకాదు ఒక్కొక్క చెట్టు నుంచి మీకు 80 పండ్లు లభిస్తాయి. ప్రస్తుతం మన ఇండియాలో కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.250 పలుకుతోంది.  అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతి చెట్టు నుండి కనీసం రూ.5000 నుండి రూ.6000 ను  సంపాదించవచ్చు.

మీరు ఒకవేళ ఒక ఎకరంలో ఈ సాగు చేస్తే కనీసం 1700 డ్రాగన్ ఫ్రూట్ చెట్లను నాటవచ్చు.. అంటే ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తే సంవత్సరానికి దాదాపు  రూ.70 లక్షల వరకు అంటే అరకోటికి పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. మొదటి సంవత్సరంలోనే మీరు డ్రాగన్ ఫ్రూట్ ఫలాలను పొందడం ప్రారంభిస్తారు.  తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పండు బాగా పెరుగుతుంది. ఖర్చు తక్కువ ఆదాయాన్ని అధికంగా అందించే ఈ సాగుతో కచ్చితంగా లక్షాధికారి అవ్వచ్చు. ఆరోగ్యానికి మేలు చేసి ఈ సాగు మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: