Money.. ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు మహిళల కోసం వినూత్నమైన పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం.. ఈ పథకం కింద వచ్చే వడ్డీ పై ఎలాంటి పనులు లేదు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైనా సరే మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ లో మహిళా సమ్మాన్ ఖాతాను తెరిచి పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా ఇందులో ఆడపిల్లల పేరు మీద మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలి.

ఈ పథకం 2025 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది.. అయితే ఆ తేదీలోపు మీరు పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.  ఇకపోతే కనిష్టంగా వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఇందులో 7.5% ఉంటుంది దాని ప్రకారం గరిష్టంగా రెండు లక్షలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి రూ.16,000, రెండు సంవత్సరాలకి 32 వేల రూపాయల వడ్డీ లభిస్తుంది అంటే మీరు నెలవారీగా చూసుకున్నట్లయితే 1300 రూపాయలను వడ్డీ కింద ఈ పథకం ద్వారా పొందవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీని రూ. 40 వేల లోపు ఉన్నందున టీడీఎస్ వర్తించదు అని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ మొత్తం వారి ఆదాయానికి జోడించబడుతుంది అని కూడా సమాచారం.  ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబు ప్రకారం పన్ను విధించబడుతుంది. కానీ అది సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు పేద మధ్యతరగతి మహిళలకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: