2012 :     హీరో  |  హీరోయిన్  |  సినిమా | దర్శకుడు  |  సంగీతం  |  విలన్  |  కామెడీ

ప్రపంచ స్థాయి సాంకేతికతతో, అనుభవజ్ఝులైన జర్నలిజం మిత్ర బృందంతో, తాజా, సంచలన వార్తా విశ్లేషణలతో... ప్రారంభించిన అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ఎపిహెరాల్డ్.కామ్ పోర్టల్, వెబ్ జర్నలిజం రంగంలో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది తెలుగువారిని  పోర్టల్ [ఎపిహెరాల్డ్.కామ్] ద్వారాను, సోషల్ నెట్ వర్కింగ్ [ఫేస్ బుక్, ట్విట్టర్] తోనూ అనుసంధానిస్తూ నిర్వహించిన అన్ లైన్ సర్వే తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలోనే సరికొత్త విధానంలో సాగింది.     యాభై చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన ‘ఎనర్జిటిక్’ సంగీత దర్శకుడు ‘ దేవిశ్రీ ప్రసాద్’, మిక్కి.జె.మేయర్, మణిశర్మ  థమన్, కీరవాణీలను తన జెట్ స్పీడు తో ఓవర్ టేక్ చేసి 2012 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నుకోబడ్డాడు.   సర్వే వివరాలు : ఉత్తమ సంగీత దర్శకుడు    దేవీశ్రీ ప్రసాద్ తన సంగీతంతో సినీ అభిమానులకు ‘కెవ్వు కేక’ పుట్టించిన దేవీశ్రీ ప్రసాద్... గబ్బర్ సింగ్ సినిమాకు గాను ‘2012 - ఉత్తమ సంగీత దర్శకుడి’గా ఎంపిక అయ్యాడు. ‘గబ్బర్ సింగ్... గబ్బర్ సింగ్’, ‘కొప్పున పూలెట్టుకుని..’ లాంటి అద్దిరిపోయో సంగీత, నేపధ్య- సంగీతాలే కాకుండా, పెన్నుపట్టి ‘ ఏం పిల్లా...’ అంటూ రేస్ లో ముందుకు దూసుకు పోయిన దేవిశ్రీ... సంగీతంతో ప్రేక్షకులను  మైమపరిపించడంలో తనకు సాటిలేదని నిరూపించుకున్నాడు.     థమన్ ఈ సర్వేలో సంగీతం విభాగంలో  తమన్ రెండవ స్థానంలో నిలిచాడు. బిజినెస్ మాన్  సినిమా కోసం తమన్ స్వరపరిచిన పాటలు విశేషంగా అలరించాయి. ‘సారొస్తారా. రొస్తారా..’ అంటూ తమన్ ఇళయరాజా, కీరవాణిలను దాటుకుని రెండవ స్థానానికి చేరుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: