తెలుగు తెలుగు,తమిళ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయినల్లో నయన తార ఒకరు. మళియాలీ ముద్దుగమ్మ అయిన నయనతార అక్కడి కంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యింది. వచ్చిన కొత్తలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘చంద్రముఖి’ లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రంలో నటించింది. తర్వాత సూర్య ‘గజిని’ చిత్రంలో హాట్ లుక్స్ తో కుర్రకారు మతులు పొగొట్టింది. మొదట్లొ బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ అమ్మడు తర్వాత స్లిమ్ గా తయారై టాప్ హీరోయిన్ల లీస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు వెంకటేష్ సరసన నటిస్తుంది..ఇప్పటికే వీరి కాంబినేషన్ లో లక్ష్మి,తులసి రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ జంట కనిపించబోతున్నారు. అంతే కాదు ఈ అమ్మడు బాలకృష్ణ సరసన సింహ,శ్రీరామ రాజ్యం చిత్రంలో కూడా నటించింది..ఈ రెండు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

హీరో శింబోతో నయనతార


ఇకపోతే నయనతార వ్యక్తి గత విషయాలు కూడా ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుతుగూనే ఉంది..గతంలో హీరో శింబుతో లవ్ ఎఫైర్, డ్యాన్స్ మాస్టర్, దర్శకులు ప్రభుదేవతో పెళ్లిదాకా వచ్చి అదికాస్త పెడాకులైంది. తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎన్నో సంచలన కథనాలు వచ్చాయి.. తాను నటించే సినిమాలో బికినీ సీన్లు చేయబోనని నయన్ ఖరాకండీగా చెబుతుంది..గతంలోతమిళ ‘బిల్లా’ సినిమాలో బికినీలో కనువిందు చేసిన ఈ సుందరి మరోసారి బికినీలో కనిపించనుందని, అందుకు నిర్మాతల వద్ద భారీగా పారితోషికాన్ని అడుగుతున్నట్టు వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై నయన తార గతంలో నేను స్విమ్ సూట్ వేసుకొని నటించిన మాట వాస్తవమే కానీ అది సందర్భానుసారంగా వచ్చే సీన్లు వాటికి కోసం తప్పనిసరై నటించాల్సి వచ్చింది..కానీ దానికోసం ఎక్కువ పారితోషికం తీసుకోలేదు

తమిళ బిల్లా చిత్రంలో బికినీతో నయనతార


.ప్రస్తుతం నాకు గ్లామర్ రోల్స్ కన్నా నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాలే ప్రాధాన్యం అంతే కాదు నటిలో దమ్ముంటే గ్లామర్‌గా నటించడానికి పొట్టి దుస్తులే అవసరం లేదు, కళ్లతోనూ నటించవచ్చనే విషయం తెలిసింది’’ అని చెప్పింది నయన.  అంతే కాదు ఈ అమ్మడు చిరంజీవి 150 చిత్రంలో కూడా నటించడానికి ఇవే కొన్ని కారణాలు అని కూడా అంటున్నారు. వెంకటేష్ చిత్రం పూర్తి అవగానే తాజాగా బాలకృష్ణ 100 వ చిత్రంలో ముచ్చటగా మూడోసారి నటించబోతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: