అర్జున్ రెడ్డి అనగానే విజయ్ దేవరకొండ గురించే ప్రస్థావిస్తాం అని అనుకుంటారని తెలుసు.. అందుకే విజయ్ దేవరకొండ అనడం కన్నా అర్జున్ రెడ్డి అని సంభోదించడం జరిగింది. అర్జున్ రెడ్డి సినిమాలో మనవాడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రిలీజ్ ముందు హిట్ కొడుతున్నాం అని చెప్పి మరి సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తను మాట్లాడితే బూతు యారోగెంట్ నెస్ బయట పడతాయి.


అయితే అది కేవలం తన సినిమాలకు మాత్రమే అలా మాట్లాడుతాడని అర్ధమవుతుంది. రీసెంట్ గా ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న నెక్ష్ట్ నువ్వే ఆడియోకి వచ్చిన విజయ్ దేవరకొండ తనలోని మరో యాంగిల్ ను చూపించాడు. ఎంతో వినయ విధేతలతో మాట్లాడి అక్కడికి వచ్చిన సిని పెద్దలను సైతం షాక్ అయ్యేలా చేశాడు.


ఆదికి నెక్ష్ట్ నువ్వే సినిమా పెద్ద హిట్ అవ్వాలని.. ఇక అల్లు అరవింద్ గారి లాంటి పెద్ద ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ కథలకే ఓ బ్యానర్ నిర్మించడం సంతోషకరమని. యువి క్రియేషన్స్ కూడా మంచి క్రేజ్ ఉన్న బ్యానర్ అని. ఈ ఇద్దరు కలిసి చేస్తున్నా ఈ తొలి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా అన్నారు. ఇక కాన్సెప్ట్ సినిమాల కోసమె పెట్టిన ఈ బ్యానర్ తనలాంటి వారికి చాలా పనికి వస్తుందని. 


ఒకవేళ తన కెరియర్ గాడి తప్పితే తాను కాన్సెప్ట్ సినిమా ఈ బ్యానర్లోనే చేస్తానని అన్నారు. ఇక హర్రర్ సినిమాలు తను చూడలేనని అవి చూడాలంటే భయం వేస్తుందని అన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ లో ఇలాంటి సరదా మనిషి కూడా ఉన్నాడని తనలో ఈ యాంగిల్ అందరికి పరిచయం చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: