నలుగురి నోట్లో నానడానికి, పది మంది గుర్తించడానికి ఈ కాలం యువత పరితపిస్తూ ఉంటుంది. దానికోసం ఎంచుకున్న మార్గమే యూట్యూబ్. తాము చేసిందంతా యూట్యూబ్ లో పెట్టేసి రాత్రికి రాత్రే స్టార్లు అయినవాళ్లు చాలామందే ఉన్నారు. ఇక హైపర్ ఆది కూడా అప్పటిలో ఒక సినిమా స్పూఫ్ చేసి యూట్యూబ్ లో పెట్టగా దాన్ని జబర్థస్త్ కమెడియన్ అదిరే అభి చూసి తన టీంలో ఛాన్స్ ఇచ్చాడు.


జబర్థస్త్ లో చేరినప్పటి నుండి ఆది దశ తిరిగిందని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రమే గాక స్కిట్లు కూడా రాసే టాలెంట్ ఉండటంతో ఆనతికాలంలోనే టీం లీడర్ అయ్యాడు. దానితో పాటు సినిమా అవకాశాలను బాగానే సంపాదించుకుంటున్నాడు. అతని పంచ్ వేసే టైమింగ్ అందరికి నవ్వులు పూయిస్తుంది. ఆది స్వయానా స్కిట్ రైటర్ కావడంచేత దర్శకులు సైతం తన పంచ్ డైలాగులను తానే రాసుకొనే స్వేచ్ఛ కూడా కల్పిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.


కమెడియన్లు కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటారు. హైపర్ ఆది అయితే మరీనూ. తాజాగా ఆయన ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. అయితే అది నిజమైన ప్రపోజ్ కాదులెండి. తొలిప్రేమ సినిమా షూటింగ్ ఫారిన్ లో  జరిగినపుడు అక్కడ ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చాడు. దానికి  "అందరికీ  హ్యపీ వాలెంటైన్స్ డే! ప్రేమను పంచండి"అని కాప్షన్ పెట్టి పోస్టు చేశాడు. కాగా అభిమానులు ఆ అమ్మాయినే పెళ్లిచేసుకో అని జోకులు పేలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: