నాని హోస్ట్ గా స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటుంది. శని, ఆదివారాలే కాదు వారం మొత్తం కూడా షో నడిపిస్తున్న కంటెస్టంట్స్ రకరకాలుగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఇక వారం ముగుస్తుంది అంటే ఎలిమినేషన్ ఉంటుందని తెలిసిందే. 


ఈ వారం గణేష్, భాను శ్రీ, దీప్తిలు నామినేషన్ లో ఉన్నారు. అయితే అందరి గురి ఈ వారం భాను శ్రీ మీదనే ఉంది. మంచి వారు, చెడ్డ వారు టాస్క్ లో కౌశల్ భాను శ్రీతో మిస్ బిహేవ్ చేశాడన్న విధంగా భానుశ్రీ కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరచాయి. భానుకి తోడుగా కౌశల్ మీద తేజశ్వి అనుమానాలు అందరిని షాక్ అయ్యేలా చేశాయి. 


అసలైతే భాను శ్రీ స్ట్రాంగెస్ట్ కంటెస్టంట్ గా అనుకుంటుండగా కౌశల్ తో భాను మాట్లాడిన తీరు ఆమె మీద ఉన్న గౌరవాన్ని తగ్గించింది. ముందు నుండి కౌశల్ మీద సెపరేషన్ చూపిస్తున్న హౌజ్ మెట్స్ జరిగిన విషయంలో మరింత రెచ్చిపోవడం జరిగింది. అయితే ఈ వారం దీప్తి కూడా ఎలిమినేషన్ లో ఉంది.


గణేష్ ఎలాగు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. ఇప్పుడప్పుడే హౌజ్ నుండి బయటకు వచ్చేలా లేడు భాను, దీప్తిల మధ్యే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే భాను మీదే అందరి ఫోకస్ ఉంది. ఇక టెలిఫోన్ నామినేషన్ లో భాను ఇచ్చిన టాస్క్ అమిత్ చేయకపోవడం వల్లే భాను నామినేషన్ కు ఎంపికైంది. మొత్తానికి భాను, దీప్తి ఇద్దరిలో ఎవరు ఫైనల్ ఎమిలినేటర్ అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: