బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తాజాగా నటించిన ‘జీరో’చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఆయనన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.  తన తన 52వ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ‘జీరో’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో షారూఖ్ ఖాన్ తెలుగు లో మాట్లాడి అందరినీ నవ్వించారు.  బాలీవుడ్ హీరోలు తెలుగు లో మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది..వచ్చీరాని భాషతో ఎదుటి వారిని నవ్వించేలా ఉంటుంది. 

ప్రెస్ మీట్ లో  మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన షారూక్..  హైదరాబాద్‌కు చెందిన రిపోర్టర్ ప్రశ్నలు  అడిగినపుడు ఈ హాస్య సంఘటన జరిగింది.   తాను హైదరాబాద్ రిపోర్టర్‌నని చెప్పగానే.. షారూక్ ఉత్సాహంగా ‘నువ్వు హైదరాబాదీవా’ అని ప్రశ్నించాడు. దానికి అవును అన్న సమాధానం ఇస్తూ..బాగున్నారా సార్ అని ప్రశ్నించింది.  వెంటనే షారూఖ్ దానికి స్పందిస్తూ..బాగా తెలుగు వచ్చిన వాడిలా ..‘ఆ, బాగున్నా.. బాగున్నా’అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. 
Image result for shahrukh zero movie stills
దాంతో అక్కడ ఉన్నవారు అంతా నవ్వారు..తర్వాత  ‘ఐయామ్ షారూక్ ఖాన్’ను అంటూ తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తూ..మనం షారూఖ్ ఖాన్ అన్నాడు..దానికి మనం కాదు..నేను షారూఖ్ ఖాన్ అనగానే..హా..నేను షారూఖ్ ఖాన్ అని అన్నారు.  షారూఖ్ తెలుగు లో మాట్లాడుతుంటే..పక్కనే కూర్చున్న అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు నవ్వుతూనే ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: