టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన వారసులుగా ఎంతో మంది హారోలుగా వస్తున్నారు.  అయితే చిత్ర పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ వరుసగా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘టాక్సీవాలా’లతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తనలా స్వయంకృషితో పైకి వచ్చిన ప్రతి ఒక్క హీరోకి మెగాస్టార్ చిరంజీవి ఎంకరేజ్ చేస్తారని ఫిలిమ్ వర్గాల టాక్. 

గతంలో శ్రీకాంత్ కి మెగాస్టార్ ఎంతగానో సపోర్ట్ చేశారు. తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు.  ఆ మద్య ‘గీతాగోవిందం’ఆడియో వేడుకలో సైతం యూత్ హీరో విజయ్ దేవరకొండను ఎంతగానో మెచ్చుకున్నారు.  అర్జున్ రెడ్డి సినిమా చూశానని ఆ సినిమాలో ఎంతో అగ్రెసీవ్ గా, రఫ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’సినిమాలో పూర్తిగా మారిపోయాడని..ఆయన నటనలో ఎంతో వేరియేషన్ చూపించాడని పొగిడారు.  తాజాగా విజయ్ దేవరకొండ .. రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో 'టాక్సీవాలా'  హిట్ టాక్ తెచ్చుకుంది.
Image result for taxiwaala
ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, మాళవిక నాయర్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలకి ముందే రష్ లీక్ కావడం..నెట్టింట్లో హల్ చల్ చేయడం జరిగింది. 

కానీ ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబడుతుంది.  ఇంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టీమ్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. దర్శక నిర్మాతలను .. ప్రియాంక జవాల్కర్ ను ఆయన అభినందించారు.  చిరంజీవి అభినందించడంతో ‘ట్యాక్సీవాలా’టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: