ఇండస్ట్రీలో అఫైర్లు మామూలే. బాలీవుడ్లో అయితే మరీ మామూలు. అందులోనూ సల్మాన్ ఖాన్ కి అయితే ఇంకా మామూలు. సంగీతా బిజ్ లాజీ మొదలుకొని రొమేనియా టీవీ స్టార్ వరకూ తిరుగులేని రొమాన్స్ ను నడిపాడు కండల వీరుడు. ప్రతిసారీ అందరి నోళ్లలోనూ పడటం, ఆనక తీరిగ్గా తెగతెంపులు చేసుకోవడం అలవాటైపోయింది ఈ ముదురు బ్రహ్మచారికి. అయితే, ఒక్కసారి విడిపోయాక వారి గురించి మాట్లాడటానికి అంతగా ఇష్టపడడు సల్లూ. కానీ తన మాజీ ప్రేయసి గురించి ఆవేశపడి అందరికీ షాకిచ్చాడు ఈ మధ్య.

సల్మాన్, కత్రినాల ప్రేమ గురించి ఎవరికి తెలీదు! పెళ్లి కూడా అయిపోతుంది అనుకునేంత పాపులర్ అయిపోయారు. ఎక్కడ చెడిందో ఏమో కానీ ఇద్దరూ వేరయిపోయారు. కత్రినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రణబీర్ కపూర్ కి దగ్గరయిపోతే, ఇవన్నీ నాకు కొత్తా అంటూ సల్లూ ఫారిన్ సుందరితో అఫైర్ మొదలెట్టేశాడు. అయితే ఈ మధ్య కత్రినా విషయంలో కామెంట్ చేసినందుకు మీడియా వాళ్ల మీద మండిపడ్డాడు సల్మాన్.

ఆ మధ్య రణబీర్ కపూర్ తో క్రతినా బికినీ వేసుకుని వేసిన వేషాలు బయటకు వచ్చాయి కదా! కుదురుగా ఉండకుండా ఓ రిపోర్టర్ దాని గురించి సల్లూ కామెంట్ కోరాడు. అంతే, అగ్గి మీద గుగ్గిలమైపోయాడు సల్మాన్. అది వారి వ్యక్తిగత విషయం, అందులో తలదూర్చాల్సిన అవసరం ఎవరికీ లేదు, అయినా ఇలా వారి పర్సనల్ ఫొటోలను బయట పెట్టడం అన్యాయం, ఆ ఫొటోలు మీ అక్కవో చెల్లివో అయితే ఇలాగే చేస్తారా అంటూ నిప్పులు చెరిగాడు. దాంతో ప్రశ్న అడిగినవాడు సైతం బెంబేలెత్తిపోయాడు. విన్నవాళ్లు మాత్రం మాజీ ప్రేయసి మీద సల్లూకి మమకారం ఇంకా తగ్గలేదంటూ సెటైర్లు వేశారు. మమకారమో, గొడ్డుకారమో మనకెందుకు గానీ... అతడన్న మాటల్లో వాస్తవాన్ని మాత్రం మనం గుర్తించి తీరాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: