తమిళ హీరోల్లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శింబు. చిన్నతనంలోనే లిటిల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శింబు తర్వాత హీరోగా మారారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన శింబు మొదటి నుంచి వివాదాస్పదాలకు కేంద్రబింధువుగా ఉంటూ వచ్చారు. అప్పట్లో ప్రస్తుతం దక్షిణాది టాప్ హీరో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయన తార ప్రేమ వ్యవహారం పెద్ద దుమారం లేపింది. వీరిద్దిరి సంబంధించిన ప్రేమ..లిప్ లాక్ ఫోటో అప్పట్లో వైరల్ అయ్యింది. కొద్ది కాలంలోనే వీరి ప్రేమ బ్రేకప్ కావడం..తర్వాత హన్సిక ప్రేమలో పడటం..కొంత కాలం తర్వాత ఆమెతో బ్రేకప్ చెప్పడం జరిగింది.

ఇలా ప్రేమ వ్యవహారాలే కాదు మహిళలను కించ పరిచారని..ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్ని వివాదాలు ఉన్న శింబు మాత్రం హీరోగా తన సత్తా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కోలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ గా ఉన్నారు శింబు. తాజాగా ఈ మ‌న్మ‌థుడు పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల శింబు సోదరుడు కురళరసన్ ఓ ఇంటివాడయ్యాడు.

కురళరసన్‌, నబీలా అహ్మద్ అన్నాశలైలోని మసీదులో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ఏప్రిల్ 26న వీరి వివాహం జ‌రిగింది. శింబు ఫ్యామిలోనే ఒక అమ్మాయిని చూడ‌గా, ఆమెతో ఆగ‌స్ట్‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్నాడ‌ట శింబు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: