ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎదిగిన సమీరా రెడ్డి మూడు నాలుగు సినిమాలు మాత్రమే చేసింది.  కెరీర్ మంచి పొజిషన్ లో ఉండనగానే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.  2015 ఓ బిడ్డకు జన్మను ఇచ్చిన సమీరా రెడ్డి ఈరోజు మరో ఆడపిల్లకు జన్మను ఇచ్చింది.  


మొదటి బిడ్డ పుట్టిన తరువాత బరువు పెరగడంతో అనేక విమర్శలు ఎదుర్కొంది.  ఈ విమర్శల నుంచి బయట పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.  జిమ్ లో కసరత్తులు చేసి బరువు తగ్గి తన టాలెంట్ ను నిరూపించుకుంది.  రీసెంట్ గా బేబీ బంప్ ఫోటోలను అండర్ వాటర్ లో ఫోటో షూట్ చేసి తానేంటో నిరూపించుకుంది.  


కూతురు పుట్టిన సందర్భంగా సమీరా ఓ పోస్ట్ చేసింది.  "నేటి ఉదయమే లిటిల్ యాంజెల్ జన్మించింది. మీ ప్రేమ.. ఆశీస్సులకు ధన్యవాదాలు`` అని సమీరా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు తన కూతురు చేతి ఫోటోను షేర్ చేసింది.  


ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  గతంలో బాబుకు జన్మను ఇచ్చిన సమీరా ఇప్పుడు ఆడపిల్లకు జన్మను ఇచ్చింది.  ఆడపిల్ల పుట్టడంతో ఆనందానికి అవధులు లేవట.  ఇంటికి లక్ష్మిదేవి వచ్చినట్టుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: