బాలీవుడ్ స్టార్ ఎనర్జిటిక్ హీరో రణ్వీర్ సింగ్- బాలీవుడ్ బ్యూటి ఆలియాభట్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా గల్లీ బోయ్. హీరో కం దర్శకనిర్మాత ఫర్హాన్ సోదరి జోయా అక్తర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రితేష్ సిద్వాణి-జోయా అక్తర్-ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాని నిర్మించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే గాక 2019 బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో టాప్ 10లో నిలిచింది. బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ఈ సినిమా సక్సస్ ను సొంతం చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే దంగల్ తర్వాత బాలీవుడ్ లో మళ్ళీ అంతటి పేరును సంపాదించుకుంది.

తాజాగా ఈ సినిమా మరో సంచలనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొత్తం 27 దేశీ సినిమాలతో పోటీపడి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియా నుంచి ఆస్కార్ 2020కి ఎంపికైంది. ఈ సెన్షేషనల్ న్యూస్ ని ఫర్హాన్ అక్తర్ అధికారికంగా ప్రకటించారు. ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) పోటీ బరిలో ఉన్న సినిమాలను పరిశీలించి గల్లీ బోయ్ సినిమాని ఏకగ్రీవంగా ఎంపిక చేశారని ఎఫ్.ఎఫ్.ఐ జనరల్ సెక్రటరీ సుప్రన్ సేన్ ప్రకటించారు. ఈ ఏడాది ఆస్కార్ ఇండియా జూరీ కమిటీకి అపర్ణాసేన్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
 
రణవీర్ సింగ్- ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో కంటెంట్ పై క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ముంబైలో ఒక గల్లీ నుంచి ర్యాపర్ గా ఎదిగిన కుర్రాడి కథ ఇది. నిజ జీవితంలోని ఎమోషన్ ని తెరపై ఆవిష్కరించడంలో జోయా పనితనానికి వందశాతం మార్కులేశారు విమర్శకులు. రణవీర్ - ఆలియా పర్‌ఫార్మెన్స్ కు ఎంతగానో పాపులారిటి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 92వ ఆస్కార్ అవార్డుల్లో ప్రపంచ సినిమాతో పోటీపడి గల్లీ బోయ్ ఆస్కార్ లు గెలుచుకుంటుందా లేదా..? అన్నది త్వరలోనే తెలియనుంది. ఇక ఆలియా రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఆలియా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: