సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చాక కొంతకాలం ఫుల్ ఫాం లో ఉండి సక్సస్ ఫుల్ హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక గాని పెళ్ళి గురించి ఆలోచించరన్న విషయం తెలిసిందే. కొందరైతే వయసు మీద పడి 30 ఏళ్ళు దాటినా కూడా కెరీర్ పీక్స్ లో ఉంటే మాత్రం పెళ్ళి ఊసెత్తకుండా..ఒకవేళ ఎవరైనా ఆటాపిక్ తెస్తే నాకేమంత వయసైపోయింది..అంటు వయ్యారాలు పోతుంటారు. కాని వేళ్ళ మీద లెక్కపెట్టే వాళ్ళు మాత్రమే నిర్మొహమాటంగా నాకు పెళ్ళైందని ఒప్పుకుంటారు. అలాంటి వాళ్ళలో మన మన్మధుడి హీరోయిన్ ఒకరు. తను పెళ్లి చేసుకున్నది నిజమే అని, తనకు పెళ్లైందని.. పెళ్లి తన కెరీర్ కు అడ్డుకాదని అంటోంది హీరోయిన్ ఆకాంక్ష సింగ్. 

సుమంత్ హీరోగా నటించిన 'మళ్లీ రావా' సినిమాతో విజయాన్ని అందుకుని, ఆ తర్వాత 'దేవదాస్'లో నాగార్జునకు జోడీగా నటించింది. ఇక రీసెంట్‌గా 'పహిల్వాన్'లో కూడా నటించిన ఆకాంక్ష సింగ్ తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది. తన భర్త పేరు కునాల్ అని, అతడికి సినీ పరిశ్రమతో సంబంధం లేదని ఈ సందర్భంగా వెల్లడించింది. సాధారణంగా పెళ్లైనవాళ్ళు హీరోయిన్లుగా కెరీర్ మొదలుపెట్టరు, పెళ్లైతే ఏ హీరోయిన్ కెరీర్ అయినా అంత సాఫీగా సాగదు. కొందరైతే పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి హీరోయిన్ గా కొనసాగే ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆకాంక్ష సింగ్ తన పెళ్లి విషయాన్ని దాచడంలేదు. అంతేకాదు తన పెళ్లి.. కెరీర్ కు ఏమాత్రం అడ్డంకాదని ఆకాంక్ష అంటోంది. 

మొదట్లో తనకు అంత గ్లామరస్ రోల్స్ రాలేదని, పహిల్వాన్ లో తను అలాంటి రోల్ చేసినట్టుగా.. ఇకపై అలాంటి రోల్స్ చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్టుగా ఆకాంక్ష దర్శక, నిర్మాతలకు క్లారిటి ఇచ్చింది. పెళ్లైన హీరోలు కెరీర్ ను కొనసాగిస్తున్నప్పుడు హీరోయిన్లకు మాత్రం అలాంటి అడ్డు ఎందుకని ఆకాంక్ష అంటోంది. వాస్తవంగా చూస్తే అది నిజమే కదా. ఇక బాహుబలి సినిమాలో అనుష్క చేసిన పాత్ర తనకు డ్రీమ్ రోల్ అని ఆకాంక్ష చెబుతోంది. అలాంటి పాత్ర చేయాలని ఉందంటోంది. మరి టాలీవుడ్ లో ఉన్న పోటీలో ప్రస్తుతం హీరోయిన్స్ అందరిని తట్టుకొని ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: