మెగా పవర్ స్టార్ రాం చరణ్, క్రేజీ డైరక్టర్ సుకుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన ఈ సినిమాతో రాం చరణ్ రేంజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న రాం చరణ్ కొరటాల శివ, చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నారు.


సినిమా తర్వాత చిరంజీవి మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ చేస్తాడని అంటున్నారు. ఈ రీమేక్ బాధ్యతను సుకుమార్ మీద పెట్టాడట రాం చరణ్. అయితే ఇప్పటివరకు సొంత కథలే తప్ప రీమేక్ జోలికి వెళ్లని సుక్కు లూసిఫర్ రీమేక్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. సుకుమార్ చేయనని చెప్పడం రాం చరణ్ ను షాక్ అయ్యేలా చేసిందట.


లూసిఫర్ సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటించాలని అనుకున్నారు. మళయాళంలో పృధ్వి రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోహన్ లాల్ తన అద్భుత నటనతో మెప్పించారు. కొరటాల శివ పూర్తయ్యే సరికి ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది. ఒకవేల సుకుమార్రీమేక్ చేయనని చెబితే మరో దర్శకుడు సీన్ లోకి వచ్చే అవకాశం ఉంది.


మరి ఆ డైరక్టర్ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మహేష్ కు చెప్పిన కథతోనే బన్నితో చేస్తున్నాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. ఈ మూవీలో బన్నితో రష్మిక మందన్న జోడీ కట్టబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. 2020 దసరాకి ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: