సుడిగాలి సుధీర్.. ఈ పేరు వినగాను వెంటనే ‘జబర్ధస్త్’ కామెడీ షో, ఢీ రియాల్టీ షోలు గుర్తుకు వస్తాయి.  ఏడేళ్ల క్రితం బుల్లితెరపై  జబర్ధస్త్ కామెడీ షో తో తన ప్రస్థానం మొదలు పెట్టిన సుధీర్... టీమ్ లీడర్ గా ఎదిగాడు.  జబర్ధస్త్ లో మాత్రమే కాకుండా ఢీ జోడి కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యాడు.  ఓ వైపు బుల్లితెరపై నటిస్తూనే.. వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు.  చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న సుడిగాలి సుధీర్ మొదటి సారిగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శేఖర్ రాజు నిర్మించిన 'సాఫ్ట్ వేర్ సుధీర్' మూవీలో నటిస్తున్నాడు.

 

ధన్యాబాలకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆ మద్య యాంకర్ ఓంకార్ తెరకెక్కించిన ‘రాజుగారి గది’ మూవీలో నటించిన  ధన్యాబాలకృష్ణ మంచి మార్కులే కొట్టేసింది.   ధన్యాబాలకృష్ణ హీరోయిన్ గా నటించినా పెద్దగా కలిసి రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తుంది.

 

ఇప్పటి వరకు జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన వేణు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు.  ఇక శకలక శంకర్ మొదట చిన్న పాత్రల్లో నటించిన ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు.  వీరి బాటలోనే నడిచిన సుడిగాలి సుధీర్ సైతం ఇప్పుడు హీరోగా మారి  'సాఫ్ట్ వేర్ సుధీర్' లో నటించాడు.  

 

ఇక ఈ మూవీలో సుధీర్ తన మార్కు కామెడీతో బాగానే నవ్వించనున్నాడనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీలో ఇంద్రజ,నాజర్,సాయాజీ షిండే, పోసాని, పృథ్వీ, తాగుబోతు రమేశ్ , విద్యుల్లేఖ రామన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: