ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేరళకు చెందిన కర్మలా మోడెక్స్ అనే మహిళ.. అనురాధ తన కన్న తల్లి అని, పుట్టిన నాలుగు రోజులకే తనను వదిలించుకుందని షాకింగ్ ఆరోపణలు చేసింది. దీనిపై అనురాధ మీడియా ద్వారా స్పందిస్తూ.. 'ఇలాంటి పనికిమాలిన మాటలను నేను పట్టించుకోను. అడ్డమైనవారు వచ్చి అమ్మ అంటే నేను పట్టించుకోవాలా. నేను స్పందిస్తే నా స్టేటస్ దిగజారిపోతుంది. ఏదేమైనా నా గురించి ఆలోచించినందుకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అని వెల్లడించారు.

 

అనురాధ మేనేజర్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘కర్మల ఓ సైకో. అనురాధకు 1974లో కూతురు పుట్టింది. ఆమె పేరు కవిత. కాబట్టి కర్మల చేసే ఆరోపణలన్నీ తప్పు. కోర్టుకు అనురాధతో పాటు ఆమె భర్త కూడా రావాలని అంటోంది. అనురాధ భర్త ఎప్పుడో చనిపోయారు. కన్న కూతురైతే ఈ విషయం తెలుసుకుని ఉండాలి కదా. ఒకవేళ ఆమె నిజంగా అనురాధ కన్న కూతురు అయివుంటే గనక ఆమే డబ్బు ఇవ్వాలి కానీ ఇలా 50 కోట్లు నష్టపరిహారం అడగకూడదు’ అని క్లారిటి ఇచ్చారు. సెలబ్రిటీలను అడ్డం పెట్టుకుని పాపులర్ అయిపోవాలని, వారి నుంచి డబ్బు తీసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. గతంలో ధనుష్ తమ సొంత కొడుకు అంటూ ఓ జంట మద్రాస్ కోర్టు చుట్టూ తిరిగారు. ఆ తర్వాత అదంతా అబద్ధమేనని తేలింది.

 

ఇప్పుడు కర్మలా మోడెక్స్ అనే మహిళ అనురాధే తన కన్న తల్లి అని ఆరోపించడానికి ఓ కారణం ఉంది. ఆమె రూపురేఖలు కాస్త అనురాధ పౌడ్వాల్‌లాగే ఉంటాయి. అందుకే ఈ నాటకం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే డీఎన్‌ఏ పరీక్షకు కూడా సిద్ధమే అంటోంది. ఇప్పటికే కేరళలోని ఓ ఫ్యామిలీ కోర్టులో అనురాధపై కేసు వేసింది. ఈ విషయం గురించి అనురాధ స్పందించడానికి ఇష్టపడలేదు కానీ కోర్టు నోటీసులు పంపితే మాత్రం తప్పకుండా రావాలి. అప్పుడు అనురాధ ఎలా రియాక్ట్ అవుతారో చూస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: