రాజ్ తరుణ్ కి గత కొంతకాలంగా సరైన హిట్టు  పడడం లేదు. ఎన్నో విభిన్నమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోతున్నాడు. సినిమా చూపిస్త మామ సినిమా తర్వాత రాజ్ తరుణ్ కు సరైన హిట్ కొట్టలేకపోయారు. కెరీర్ మొదట్లో యువ కథానాయకుల్లో  తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ ఆశలు కాస్తా ఆవిరైపోయింది. 

 


 వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ తన తాజా సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఎన్ని విభిన్నమైన కథలతో కొత్త దర్శకులతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన... రాజ్ తరుణ్ మాత్రం బొక్కబోర్లా పడిపోతున్నాడు. అయితే రాజ్ తరుణ్  సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నన్నప్పటికీ... రాజ్ తరుణ్ అంచనాలను ఆశలను అభిమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో అటు  కొంచెం కొంచెంగా అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క హిట్టు పడితే చాలు ఆ తర్వాత కెరీర్ ని సెట్ చేసుకోవచ్చు అని ఆశ పడుతున్న రాజ్ తరుణ్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 

అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నమ్మకంతో చేసిన మూవీ ఒరేయ్ బుజ్జి గా. గతంలో గుండెజారి గల్లంతయిందే సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కొండ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో  రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హెబ్బా పటేల్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ లుక్ ను  రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ నెల 10వ తేదీన 10 గంటల 10 నిమిషాలకు ఫస్ట్లుక్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బంధం అధికారికంగా తెలిపింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ కు సరైన హిట్టు పడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: