టాలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమంత తెలుగు ప్రేక్షకులందరికీ మాయ చేసింది. తనదైన అందం అభినయంతో తన చిలిపి నవ్వుతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది సమంత. ఇక ఆ తర్వాత ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తనదైన అందాలతో మత్తెక్కించింది. మొదటి సినిమా నుంచి నాగచైతన్య తో ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఆ తరవాత పెళ్లితో ఒక్కటయ్యారు. అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు సంచలన విజయాలను నమోదు చేసుకుని ఉండడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది.

 

 

 గతేడాది నాగచైతన్యతో  నటించిన మజిలీ,  లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఓ బేబీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇక తాజాగా తమిళ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ సినిమాలో శర్వానంద్ సరసన నటించింది అక్కినేని వారి కోడలు సమంత. అయితే సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్న జాను సినిమా మాత్రం నిరాశ పరిచింది అని చెప్పాలి. అయితే వరుస సినిమాలు చేసుకుంటూ సంచలన విజయాలను నమోదు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో వైపు కూడా అడుగులు వేస్తుంది ఈ అక్కినేని వారి కోడలు. ది ఫ్యామిలీ మెన్  వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.దీనిపై  సమంత కూడా ప్రకటన చేసింది. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా సమంత హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

 

 

 సమంతతో పాటు మరో హీరోయిన్గా నయనతార కూడా ఈ సినిమాలో నటించ బోతోంది. సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సమంత మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చేశారట. హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న సరసన ఓ మూవీలో హీరోయిన్గా సమంత నటిస్తుండగా...  ఈ చిత్రానికి కూడా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తారని దీనిపై అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాక అశ్విన్ శరవణన్ ఇంతకుముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు  అయినా మాయ గేమ్ ఓవర్ లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: