ప్రతి వారం అభిమాన హీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎంతోమంది అభిమానులు వాళ్ళ హీరో సినిమా కోసం శుక్రవారం వరుకు ఎదురు చూసి సినిమా ఎలా ఉంది అబ్బా అనుకోని వెళ్తారు. ఇక పోతే.. ఈ వారం శుక్రవారం సినిమాలు విడుదల అయినప్పటికీ దుల్కర్ సినిమాలు పెద్దగా హిట్ కొట్టలేదు.. అలాగే నాని నిర్మాణ సంస్థ నుంచి విడుదల అయిన హిట్ సినిమాలో హీరోకు కూడా ఇది రెండో సినిమా అవ్వడం వల్ల పెద్ద టాక్ ఏం లేదు. 

 

అయితే ఆ సినిమాలకు సంబంధించి వివాదాలు ఏం అవ్వలేదు కానీ.. సినిమాలు ఏమి లేకపోయినప్పటికీ ఏదో కామెడీ చెయ్యాలి అనుకోని ఎందరో మనోభావాలు దెబ్బ తీసేలా హీరో నిఖిల్ ట్విట్ పెట్టి వివాదంలో పడ్డాడు. అంత పెద్ద వివాదం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. 

 

చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే ఈ కరోనా వైరస్ 50 దేశాలకు వ్యాపించింది. దీంతో ఎక్కడ ప్రజలంతా ఈ కరోనా వైరస్ భారిన పడుతారో అని అందరూ భయపడి చస్తుంటే హీరో నిఖిల్ మాత్రం ఈ వైరస్ పై ట్విట్టర్ వేదికగా సిల్లీ కామెంట్ చేసి వివాదంలో పడ్డాడు.  

 

కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయిందని, 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ ఇంతగా పడిపోయింది లేదు అని ఓ వ్యక్తి ట్వీట్ చేసారు. ఆ ట్విట్ కు నిఖిల్ స్పందిస్తూ.. ''థ్యాంక్స్ టు కరోనా వైరస్. స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం'' అని కామెంట్ చేసాడు. దీంతో ప్రముఖ జర్నలిస్ట్ హేమంత్‌ ఈ ట్విట్ కు ఘాటైన సమాధానం ఇచ్చారు. 

 

''ఇలాంటి సమయంలో నీ కామెంట్ చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంది బ్రో. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రజలు వైరస్ వల్ల అల్లాడిపోతున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా'' అని నిఖిల్‌పై మండిపడ్డడు.. ఈ కామెంట్స్ కు మరి కొందరు కూడా స్పందిస్తూ ప్రజలు చచ్చిపోతున్న సమయంలో ఇలా స్పందించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని ఫైర్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ వారం వివాదానికి గురైన హీరో నిఖిల్ అనే చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: