నితిన్ తో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తీసి హిట్ అందుకున్న డైరక్టర్ విజయ్ కుమార్ కొండా ఆ సినిమా తర్వాత క్రేజ్ తెచ్చుకున్నా సెకండ్ మూవీగా వచ్చిన ఒక లైలా కోసం పెద్దగా ఆడకపోయే సరికి కెరియర్ లో వెనుకపడ్డాడు. 2014లో వచ్చిన ఒక లైలా కోసం తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన డైరక్టర్ విజయ్ కుమార్ కొండా మళ్ళీ ఇన్నాళ్ళకు ఓ సినిమాతో వస్తున్నాడు. యువ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను డైరెక్ట్ చేశారు విజయ్ కుమార్.

 

హీరోగా రాజ్ తరుణ్ కూడా వరుస ఫ్లాపులతో అసలు ఫాంలో లేడని చెప్పాలి. తను చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. విజయ్ కుమార్ కొండాతో రాజ్ తరుణ్ చేసిన సినిమా ఒరేయ్ బుజ్జిగాసినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఈమధ్య వచ్చిన రాజ్ తరుణ్ సినిమాల కన్నా బెటర్ అన్నట్టుగానే ఉంది. విజయ్ కుమార్ తనకు పట్టున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లోనే ఈ సినిమాను తీసినట్టు ఉన్నారు. టీజర్ అయితే ఇంప్రెసివ్ గానే అనిపిస్తుంది.

 

రాజ్ తరుణ్, మాళవిక నాయర్ తో పాటుగా సినిమాలో హెబ్బా పటేల్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. కుమారి 21ఎఫ్ సినిమా నుండి రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇలా ఉన్నారు కాని లేదంటే రాజ్ తరుణ్, హెబ్బా ఇద్దరు మంచి స్థానంలో ఉండాల్సిన వాళ్ళే. అయితే సినిమాలు లేక హెబ్బా ఈమధ్య ఒకటి రెండు సినిమాల్లో వ్యాంప్ గా కూడా కనిపించింది. మరి ఒరేయ్ బుజ్జిగా సినిమాతో అటు రాజ్ తరుణ్ తో పాటుగా హెబ్బా పటేల్ కు కెరియర్ కు జోష్ అందించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: