సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు, తమిళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ సినిమాలు కొన్నాళ్ల క్రితం వరకు ఒకింత తక్కువ బడ్జెట్ తో రూపొందుతూ ఉండేవి. బడ్జెట్ కంటే అక్కడి నిర్మాతలు, దర్శకులు కథలు, కథనాల్లోని బలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారని, అందువల్లనే అక్కడ సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగా ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నాని సరసన అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్, ఇప్పటివరకు కెరీర్ పరంగా ఎక్కువగా క్యారెక్టర్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటించడంతో పాటు ఎక్కువగా ఎక్స్ పోజింగ్ కూడా చేయలేదనే చెప్పాలి. 

 

ఇక మరొకనటి కార్తీక, యువ హీరో నాగచైతన్య సరసన జోష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో ఆ తరువాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాల్లో నటించినప్పటికీ సరైన సక్సెస్ ఆమెకు దక్కలేదు. ఇక వీరిద్దరూ కలిసి 2011లో నటించిన మలయాళ ప్రతిష్టాత్మక సినిమా మకరమంజు. తెలుగులో ఈ సినిమా రవివర్మ పేరుతో డబ్బింగ్ చేయబడి ఇటీవల యూట్యూబ్ లో ప్రదర్శితం అవుతోంది. అయితే ఈ సినిమాలో నిత్యా, కార్తీక ఇద్దరూ కూడా తాము నటించిన పాత్రల్లో ఒకింత రొమాంటిక్ ఫీల్ తో కనపడతారు అనే చెప్పాలి. ఇప్పటివరకు వారు, తమ కెరీర్ పరంగా అటువంటి పాత్రలు అయితే చేయలేదనే చెప్పాలి. 

 

ఇక సినిమాలో అక్కడక్కడా కొన్ని మంచి రొమాంటిక్ సీన్స్ ఉండడంతో, కొందరు ఆ సినిమాని తెగ చూసేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ సినిమా విపరీతమైన వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ప్రముఖ చిత్రకారుడు రవివర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకోగా లెనిన్ రాజేంద్రన్ ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రైన రవివర్మ పాత్రలో ప్రముఖ కెమెరా మ్యాన్ సంతోష్ శివన్ ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: