ప్రముఖ బ్యాట్ మెంటన్ గుత్వా జ్వాలా అంటే తెలియని వారు ఉండరు. భారత బ్యాడ్మింటన్ రంగంలో సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు ఎలాగో డబుల్స్ రంగంలో గుత్తా జ్వాల కూడా అదేస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. గత కొంత కాలంగా ఆమె ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉన్నారంటూ తెగ వార్తలు వస్తున్నాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ నటుడు విష్ణు విశాల్ తో మీ బంధం గురించి అని అడిగిన ప్రశ్నకు తాము డేటింగ్ లో ఉన్నామని ఆమె చెప్పారు.  ఇటీవల విష్ణు విశాల్, జ్వాలతో కలిసి తీసుకున్న సెల్ఫీలను సోషల్ మాద్యంలో పోస్ట్ చేసింది గుత్తా జ్వాలా.  ఒకరి బర్త్‌డేలు ఒకరు సెలబ్రేట్ చేసుకోవడం చూసి వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి అందరికీ.

 

ప్రేమికులరోజు నాడు స్వయంగా జ్వాల, విష్ణుతో తన రిలేషన్ గురించి బయటపెట్టింది.  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫోటో షేర్ చేస్తూ ‘ఇతడే నా వేలంటైన్’ అని పోస్ట్ చేసింది.  ప్రస్తుతం  ఆమె కోచింగ్ రంగంలో అడుగుపెట్టి సొంత అకాడమీ కార్యకలాపాలతో తీరికలేకుండా ఉంది. ఎప్పుడు విష్ణు విశాల్‌తో తన రిలేషన్ గురించి అడిగినా ‘అది నా పర్సనల్’ అంటూ మాట దాటవేస్తూ వచ్చిన జ్వాలా తన రిలేషన్ గురించి ఓపెన్ అయింది. ‘‘మేం డేటింగ్‌లో ఉన్నాం.  త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది.

 

అయితే పెళ్లి ఎప్పుడన్నది చెప్పలేనని, అందరికీ చెప్పి అందరినీ తప్పకుండా ఆహ్వానిస్తానని అన్నారు. జ్వాల ప్రస్తుత రాజకీయాలపైనా తన అభిప్రాయాలను పంచుకుంది. కొన్ని జాతీయ పార్టీలు తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయని, అయితే తన భావజాలానికి తగిన పార్టీలు ఏవీ కనిపించలేదని, అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: