పెళ్లి చేసుకుంటే కలిసొస్తుంది. జాతకం మారిపోతుందంటే నమ్మకం కలుగడం లేదా.. ముద్దుగుమ్మల నివాసాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. పెళ్లి చేసుకోవడం ఆలస్యం.. బంగ్లాకు.. ఖరీదైన విల్లాకు షిప్ట్ అయిపోతున్నారు. అవి అలాంటి ఇలాంటి విల్లాలు కావు. చూస్తే కళ్లు చెదరాల్సిందే. కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నారు. 

 

ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేసి చూడు అంటారు. హీరోయిన్స్ విషయంలో కాస్తా.. పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడుగా మార్చేశారు. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా లెవల్ మారిపోయింది. లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన ఈ జంట.. అందమైన విల్లాను కొనుక్కుంది. అత్యంత ఖరీదైన ఫెర్నాండో వ్యాలీలో 20మిలియన్ డాలర్లు విలువ చేసే విల్లాను ప్రియురాలు ప్రియాంక కోసం నిక్ కొనుగోలు చేశారు. ఈ జంట ప్రస్తుతం లాక్ డౌన్ ను అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. 

 

ప్రియాంకా విల్లా ఫోటోలు చూసి నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. ప్రకృతి ఇంట్లోకి తొంగి చూస్తోందా అన్నట్టు ఉంది. ఇంట్లో నుంచే కనిపిస్తున్నకొండలు.. చెట్లు.. ఆకాశం.. సీనరీస్ కంటికి కావాల్సినంత ఆనందం ఇచ్చాయి. 20వేల చదరపు అడుగులతో ఉన్న ఈ ఇంట్లో 7పడక గదులు.. 11 బాత్ రూమ్ లు ఉన్నాయి.  

 

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ప్రస్తుతం 173కోట్లు విలువచేసే బంగ్లాలో నివాసముంటోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీలోని తన ఇంటికే పరిమితమైన సోనమ్ భర్త ఆనంద్ అహుజాతో కలిసి కాలక్షేపం చేస్తోంది. ఈ క్రమంలో తీసుకున్న ఫోటోల్ని షేర్ చేసింది. ఢిల్లీలో ఉన్న ఈ బంగ్లా విలువ రూ.173కోట్లని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బాలీవుడ్ భామలు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారు. స్వర్గం లాంటి ఇంట్లో అందాల రాణుల్లా మెరిసిపోతున్నారు. జీవితం అంటే తమదే అనేలా తన లగ్జరీ లైఫ్ ను ప్రదర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: