మహేష్ బాబు హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆగడు. ఈ సినిమా పెద్ద స్క్రీన్ మీద అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో ప్రధానంగా కామెడి ని ఆధారంగా చేసుకుని చేసారు అని అందుకే సినిమా ఆ రేంజ్ లో ఫ్లాప్ అయింది అని సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫాన్స్ అప్పుడు  ఆగ్రహం వ్యక్తం చేసారు.  కథ ఉండి ఉంటే సినిమా హిట్ అయి ఉండేది అని కాని సినిమాలో అసలు ఏ విధంగా చూసినా సరే కథ లేదు అని కేవలం పంచ్ డైలాగుల కోసం సినిమాను మహేష్ బాబు చేసాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు నటన చాలా మంది ప్రేక్షకులకు నచ్చుతు ఉంటుంది. ఆయన బాడి మేనరిజం గాని పోలీస్ అధికారిగా మహేష్ బాబు నటన గాని అన్నీ కూడా జనాలకు బాగానే నచ్చాయి అని చెప్పాలి. ఇక మహేష్ బాబు నటన జనాలకు పెద్ద స్క్రీన్ మీద అంతగా నచ్చలేదు గాని చిన్న స్క్రీన్ మీద మాత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు నటన తో పాటుగా ఆయన నోటి నుంచి వచ్చే మాటల కోసం జనాలు సినిమాను ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు టీవీ లో అనేది వాస్తవం. 

 

సినిమా హిట్ అవడానికి మహేష్ బాబు కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదు అని అందుకే సినిమా ఫ్లాప్ అయింది అని అంటారు జనాలు. ఈ సినిమా విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేది ఈ సినిమా అని అంటారు జనాలు. ఈ సినిమా తర్వాత మహేష్ కూడా భయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: