గోవిందుడు అందరి వాడేలే.. ఇది అసలు రామ్ చరణ్ చెయ్యాల్సిన సినిమానే కాదు. అసలు ఫ్యామిలీ డ్రామా అంత అది నాటకం ఉన్నట్టు ఉంది కానీ సినిమాలా అనిపించలేదు. ఒకోకరి పాత్ర అక్కడికి తీసుకెళ్లి అతికించినట్టు ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం వెయిట్ చేసి ఫస్ట్ షో చుసిన రామ్ చరణ్ అభిమానులు అంత తలకొట్టుకుంటూ వచ్చారు అని అప్పట్లో టాక్. 

 

IHG

 

అలా ఎందుకు అంటే? రామ్ చరణ్ అప్పటి వరకు మంచి మాస్ చిత్రాలు, ఫాంటసీ చిత్రాలు తీసి ఒక్కసారిగా ఇలా ఫ్యామిలీ డ్రామాలో నటించేసరికి అభిమానులకు ఏం అనాలో అర్థం కాలేదు.. ఎందుకు రామ్ చరణ్సినిమా తీశాడు అంటూ తెగ హర్ట్ అయిపోయారు. ఇంకా అందుకే రామ్ చరణ్ సినిమా అయినా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. 

 

IHG

 

అయితే.. వెండితెరపై అట్టర్ ప్లాప్ అయినా ఈ సినిమా బుల్లితెరపై మంచి టీఆర్పీని తెచ్చింది. ఏకంగా 16.05 టీఆర్పీని తెచ్చింది. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడవాళ్లు అంత బాగా కనెక్ట్ అయిపోయి చూశారు. రామ్ చరణ్ సినిమా అయినప్పటికీ అయన అభిమానులు కూడా ఈ సినిమాను థియేటర్ లో చూడాలి అని అనుకోలేదట. 

 

IHG

 

అలానే ఇంట్లో అయితే సినిమా ఓకే కానీ థియేటర్ లో ఈ సినిమాను చూడలేం అని అభిమానులే చెప్పేసారు. అందుకే ఈ సినిమాకు బుల్లితెరపై మంచి టాక్ వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా కాస్త శతమానం భవతి, కాస్త సుకుమారుడు సినిమా స్టోరీ తీసుకొని చేసినట్టు ఉంది అని టాక్ కూడా ఉంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: