దంగల్ సినిమా లో అక్కచెల్లెలుగా నటించిన సన్యా  మల్హోత్ర, ఫాతిమా సన షేక్  సినిమా లో డేటింగ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా బాలీవుడ్లో ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ వస్తున్న వార్తలు బాలీవుడ్లో సంచలన గా మారిపోయాయి. తాజాగా తమపై వస్తున్న వార్తలపై స్పందించారు ఫాతిమా సనా షేక్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ కి హాజరైన  ఫాతిమా సనా షేక్ కి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. అయితే తాను సహా సన్యా మల్హోత్రా  తో డేటింగ్ లో ఉన్నాను అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఫాతిమా ఆసక్తికర సమాధానం చెప్పు వచ్చింది. 

 

 మేమిద్దరం డేటింగ్లో ఉన్నామంటూ  వచ్చిన వార్తలను చూడగానే మాకు ముందుగా నవ్వోచ్చిందని... మేమిద్దరం ఎంతో మంచి స్నేహితులు అంటూ చెప్పుకొచ్చింది. కానీ  అందరూ మా ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని తప్పుగా భావించారు అంటూ చెప్పుకొచ్చింది ఫాతిమా. సన్యాసి మీకు  నచ్చిన విషయాలు ఏమిటి అని ప్రశ్నించగా... సన్యా లో  తనకు మూడు విషయాలు ఎంతో బాగా నచ్చుతాయి అంటూ తెలిపింది. సన్యా మల్హోత్రా  నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను  తెలిపింది నటి ఫాతిమా.

 


సన్యా  మల్హోత్ర ప్రతి విషయంలో ఎంతో శుభ్రత తో ఉంటుందని... అంతేకాకుండా పనిపట్ల అంకితభావం ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. సన్యా లో  ఇవి తనకు ఎంతగానో నచ్చాయి అంటూ తెలిపింది ఫాతిమా . అయితే తమ పై వస్తున్న వదంతులు మాత్రం తమకు ఎప్పుడు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. అయితే సన్యా  మల్హోత్ర, ఫాతిమా సన షేక్ లు  దంగల్ సినిమా లో అక్కచెల్లెలు గా నటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: