మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లాక్ డౌన్ తో ఆగిపోయింది. ఇటీవల అనుమతులు లభించడంతో ఆగస్టు నుండి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి ఏది ఏమైనా 2021 సంక్రాంతి కి రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిసున్న ఈ సినిమాలో రాం చరణ్ ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా చిరంజీవి చరణ్ ల మద్య వచ్చే సన్నివేశాలు సినిమా రేంజ్ ని బాగా పెంచుతాయని అంటున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ లో నటిస్తారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం రీమేక్ స్క్రిప్ట్ ని పకడ్బంధీగా సిద్దం చేసే పనిలో ఉన్నాడు. అన్ని కుదిరితే లూసీఫర్ దసరా పండుగకి ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశాలున్నాయని తాజా సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన..మిగతా విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 

 

అయితే కొన్ని రోజుల ముందు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత విజయ శాంతి నటిస్తుందన్న వార్త కూడా స్ప్రెడ్ అయింది. అయితే లూసీఫర్ లో  సల్మాన్ నటిస్తున్నాడన్న వార్తలు కంప్లీట్ గా ఫేక్ అని ఎలా అయితే క్లారిటీ ఇచ్చారో అలాగే విజయశాంతి నటించడం కూడా అలాంటి గాలి వార్తే అని తేల్చేశారు.

 

ఇప్పటివరకు ఈ సినిమాలో నటీ నటుల గురించి దర్శక, నిర్మాతలు ఆలోచించనేలేదట. మరి ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అని చిత్ర యూనిట్ సందిగ్ధం లో ఉండగానే మళ్ళీ ఇప్పుడు తాజాగా సుహాసిని ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందన్న వార్త వచ్చింది. అయితే ఇది కూడా అఫీషియల్ న్యూస్ కాదని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: