ఇస్మార్ట్ శంకర్.. గత సంవత్సరం విడుదల అయ్యి ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్పణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

ఇంకా ఈ సినిమాలో హీరోగా రామ్ పోతినేని, హీరోయిన్లగా నిధి అగర్వాల్, నభా నటాషా నటించారు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్లు ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేశారు. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా థియేట‌ర్స్‌లో ఎన్ని క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిందో యూట్యూబ్‌లోనే అంతే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 

 

IHG

 

ఎందుకంటే ఈ సినిమా పాటలు అంత అద్భుతంగా ఉన్నాయ్. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. మంచి ఊపు వచ్చే పాటలు అంటే ఈ సినిమా పాటలే. ఇంకా ఈ సినిమాలో దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇప్పటికి 120 మిలియన్ వ్యూస్ మార్క్ ను ఈ సాంగ్ దాటింది.

 

 శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసిన ఈ సాంగ్‌లో రామ్‌, నిధి అగ‌ర్వాల్ న‌భా న‌టాషాలు త‌మ డ్యాన్స్‌తో వావ్ అనిపించారు. 11 ఏళ్లుగా సరైన విజయం లేక ఎదురు చూసిన పూరీ జగన్నాథ్ కి ఈ సినిమా మంచి హిట్ అందించింది. ఇంకా దిమాక్ ఖరాబ్ సాంగ్ యూట్యూబ్ సంచలనంగా మారింది. ఎవరికైన సరే ఈ పాట వింటే డ్యాన్స్ వెయ్యాలనిపిస్తుంది. అంత అద్భుతమైన సాంగ్ ఇది.             

 

మరింత సమాచారం తెలుసుకోండి: