నిర్మాత దిల్ రాజ్ మాటలను లెక్క చేయకుండా దర్శకుడు శ్రీను వైట్ల నడుచుకుంటున్న తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రకాష్ రాజ్ వ్యవహారంలో మధ్య వర్తిగా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ చేస్తున్న ఎటువంటి రాజీ మార్గాన్ని శ్రీనువైట్ల అంగీకరించకుండా మొండి పట్టుదలగా వ్యవహరించడం వెనుక మరెమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ చేత శ్రీనువైట్లకు అదేవిధంగా అతని కో డైరెక్టర్ కు కూడ క్షమార్పణ చెప్పిస్తానని దిల్ రాజ్ చెప్పిన సూచనను ఏమాత్రం పట్టించుకోకుండా తన కో డైరెక్టర్ దర్శకుల సంఘానికి ఇచ్చిన కంప్లైంట్ వెనక్కు తీసుకునే పరిస్థితి లేదని శ్రీనువైట్ల ఇచ్చిన సమాధానం దిల్ రాజ్ మైండ్ బ్లాంక్ చేసిందని అంటున్నారు. దీనితో ప్రకాష్ రాజ్ పై చర్యలు చేపట్టకుండా అడ్డు కట్టలు వేయడానికి దిల్ రాజ్ దాసరి సహాయాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. ఎవరి మాట వినని సీతయ్యగా మారిపోయిన శ్రీనువైట్ల స్పీడ్ కు దాసరి తన సమయస్పూర్తితో ఎలా అడ్డుకట్ట వేస్తాడో అన్న ఆశక్తి అందరిలో పెరిగిపోతోంది. ఏమైనా ఈ విషయంలో మే డే నాడు ఒక క్లారిటి వస్తుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రకాష్ రాజ్ లాంటి నటుడు వ్యక్తిగతంగా క్షమార్పణ చెపుతానని ముందుకు వస్తున్నా శ్రీనువైట్ల అతడి అసోసియేట్ ఈ వ్యవహారాన్ని మరింత బిగించడం మంచిది కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్న వర్గం కూడ టాలీవుడ్ లో కనపడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: