సినిమా పరిశ్రమలో వారసుల హవా మాములుగా ఉండదు. స్టార్ హీరో కొడుకు కచ్చితంగా స్టార్ అవ్వాల్సిందే. వారసులకు ఫ్యాన్స్ కూడా ప్రోత్సాహం అందిస్తారు. ఇప్పటికే సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీస్ నుండి వారసులు రావడం జరిగింది. అక్కినేని ఫ్యామిలీ నుండి యువ హీరోలు మంచి జోష్ లో ఉన్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా వచ్చాడు. వెంకటేష్ తనయుడు అర్జున్ ఎంట్రీకి ఇంకాస్త టైం ఉంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ మీద ఉంది.  

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ లో ఎక్సయిటింగ్ ఉంది. ఎప్పుడో లెజెండ్ టైంలోనే మోక్షజ్ఞ డెబ్యూ ఉందని అన్నారు. కాని అందులో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వలేదు. ఇక శాతకర్ణి సినిమాలో కూడా మోక్షజ్ఞ గెస్ట్ రోల్ ఉంటుందని వార్తలు రాగా అందులో కూడా కనిపించలేదు. క్రిష్ డైరక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అని వార్తలు వస్తున్నా అందులో కూడా వాస్తవం లేదని తెలుస్తుంది.

మోక్షజ్ఞ ఎంట్రీ పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం చూసి బాలయ్య బాబు మోక్షజ్ఞ ఎంట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఇక మీదట వారసుడిని తెరగేట్రం చేయించేందుకు బాలకృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారట. మొన్నామధ్య ఇంటర్వ్యూస్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది. కాని కొద్దిగా టైం పడుతుందని అన్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్న గోలని భరించలేక మోక్షజ్ఞ ఎంట్రీ షురూ చేసేలా ఉన్నారు.      

ప్రస్తుతం బయటకు వస్తున్న మోక్షజ్ఞ పిక్స్ ని చూస్తే హీరో కి కావాల్సిన ఫిట్ నెస్ కనిపించడం లేదు. అయితే నెల రోజులు కష్టపడితే ఎలా కావాలంటే అలా తయారవొచ్చు అదేమంత పెద్ద విషయం కాదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి బాలకృష్ణ దృష్టి పెట్టారంటే త్వరలోనే మోక్షజ్ఞ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి నందమూరి నట వారసుడి మొదటి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: