టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే విషయంలో స్టార్ హీరోలు అడుగులు వేస్తూ ఉంటారు. అగ్ర హీరోలు ఏ విధంగా అవకాశాలు వచ్చినా సరే ప్రయోగాలు చేయడానికి ముందుకు వచ్చారు. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే బాలకృష్ణ గాని చిరంజీవి గాని వెంకటేష్ గారి ప్రయోగాలు చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణ మాత్రం ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా  ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ ఇటీవల ఒక భారీ ప్రాజెక్టు కోసం ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


నందమూరి ఫ్యామిలీతో కలిసి ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ కూడా దృష్టి సారిస్తున్నారు. అందరం కలిసి ముందుకు తీసుకుని వెళ్దామని దీనికి సంబంధించి నందమూరి ఫ్యామిలీ అంత ఒకసారి కూర్చొని ఆలోచించకుందామని చెప్పారట. మళ్లీ భవిష్యత్తు సమయం వస్తుందో రాదో అని కాబట్టి ఇప్పుడు మోక్షజ్ఞ తో పాటుగా కళ్యాణ్ రామ్, అదే విధంగా తారకరత్న సహా అందరం కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేద్దామని,


ఈ భారీ ప్రాజెక్టు ప్రశాంత్ దర్శకత్వంలో అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బాలకృష్ణ దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేశారని వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఈ సినిమాను వచ్చే నెల మొదలు పెట్టే అవకాశాలున్నాయని వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి.  రామోజీ ఫిలింసిటీలో గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంకా స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: