టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది సమీరారెడ్డి. దాదాపు పదేళ్ల క్రితం ఆమె టాలీవుడ్ లో హాట్ టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ తో ఆయనకు ప్రేమ అని ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ ఆ తర్వాత మాత్రం ఆమె టాలీవుడ్ లో పెద్దగా కనబడలేదు. ఇక బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ కనబడింది. ఆ తర్వాత వివాహం చేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది అనే వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి.

 గత కొన్ని రోజులుగా ఆమె తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఇప్పుడు సమీరారెడ్డి మాత్రం ఒక స్టార్ హీరో సినిమాలో నటించడానికి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని టాలీవుడ్ వర్గాల మాట. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె చర్చలు కూడా జరిపింది అని టాక్. అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియకపోయినా బెంగళూరులో ఒక బిజినెస్ మెన్ పాత్రలో ఆమె కనబడే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్.

 ప్రస్తుతం సమీరారెడ్డి బాలీవుడ్ లో ఒక సినిమా చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే సినిమాలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది త్రివిక్రమ్ ఇప్పటికే ఆమెకు  చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి సమీరారెడ్డి నటిస్తుందా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: