బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 2 స్టేట్స్ మూవీను తెలుగులోకి రిమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకు సంబంధించి స్టార్ కాస్టింగ్ పై సెర్చింగ్ జరుగుతుంది. అంత కంటే ముందుగా ఈ మూవీను ఏ డైరెక్టర్ చేతిలో పెట్టాలనేది నిర్మాతల మొదటి పనిగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. చేతన్ భగత్ నవల ఆధారంగా హింది లో నిర్మింపబడిన ’2 స్టేట్స్’ సంచలన విజయం సాదించింది. ఈ చిత్రం లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీకు సంబంధించిన రిమేక్ హక్కులను పి.వి.పి సంస్థ కైవసం చేసుకుంది. సౌత్ లో తెలుగు, తమిళ్ భాషల్లో రిమేక్ అవుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ని ఎవరిని ఎంచుకోవాలో అన్నదానిపై నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ ని నిర్మాతలు సంప్రదించారంట. అయితే క్రిష్ మాత్రం తెలుగులో మహేష్ బాబు కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈ రిమేక్ మూవీను ఒప్పుకోవటానికి సిద్ధంగా లేడు. కాని పి.వి.పి సంస్థ మాత్రం డైరెక్టర్ క్రిష్ ను ఒప్పించేదుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. కావాలంటే డైరెక్టర్ రెమ్యునరేషన్ ను సైతం డబుల్ చేసేందుకు పి.వి.పి సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో గబ్బర్ మూవీను తెరకెక్కించే పనులో ఉన్నాడు. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఒక వేళ నిర్మాతలు క్రిష్ ను ఒప్పిస్తే, గబ్బర్ మూవీ తరువాత క్రిష్, 2స్టేట్స్ మూవీ సౌత్ రిమేక్ లో పనిచేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: