నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనయుడు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రెండేళ్ల క్రితమే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ జరగాల్సిందని అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంత వాయిదా పడిందని అంటున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ మరోవైపు తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా విషయమై ఎంతో కేర్ తీసుకుంటున్నారట.

నిన్న మొన్నటి వరకూ తన చదువులో పూర్తిగా నిమగ్నమైన మోక్షజ్ఞ ఇకపై యాక్టింగ్, డాన్సింగ్, కరాటే వంటి పలు విద్యల్లో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. అతి త్వరలో ఆ ప్రక్రియ మొదలు కానుందని అలానే ఇంకోవైపు అతడిని పరిచయం చేసే సినిమాకు దర్శకుడిగా కొన్నాళ్లుగా పలువురు దర్శకులను పరిశీలించిన బాలయ్య ఫైనల్ గా ఒక స్టార్ దర్శకుడిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అంటున్నారు. నువ్వే నువ్వే సినిమా తో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొన్నటి అలవైకుంఠపురములో సినిమా వరకు తన కెరీర్లో ఎన్నో భారీ విజయాల్ని అందుకున్నాడు.

ఇక త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, టేకింగ్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలను పరిశీలిస్తే మంచి ఎంటర్టైనింగ్ గా ఎమోషనల్ వేలో సాగుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. కాబట్టి ఆయనైతేనే మోక్షజ్ఞ లాంఛింగ్ మూవీకి సరైన న్యాయం చేయగలడు అని భావించారట బాలయ్య. అలానే పలువురు బాలయ్య సన్నిహితులు కొందరు కూడా త్రివిక్రమ్ పేరునే సూచించినట్లు చెబుతున్నారు. ఇక అతి త్వరలో త్రివిక్రమ్ ను కలిసి మోక్షజ్ఞ సినిమా విషయమై మాట్లాడనున్నారట బాలకృష్ణ. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021 మధ్యలో మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మోక్షజ్ఞ ఎంట్రీ న్యూస్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అనే చెప్పాలి.....!!












మరింత సమాచారం తెలుసుకోండి: