ఈ ఇయర్ మొదట్లోనే భీష్మ లాంటి సూపర్ హిట్ మూవీ తన ఖాతాలో వేసుకున్న నితిన్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అందాదున్ రీమేక్ కు ముహుర్తం పెట్టాడు. అయితే ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన చంద్రశేఖర్ యేలేటి సినిమా అప్డేట్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో నితిన్ చేస్తున్న సినిమా ప్రీ లుక్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు.

నితిన్ తో 'చెక్' పెట్టించేందుకు రెడీ అయ్యారు చంద్రశేఖర్ యేలేటి. ఇక ప్రీ లుక్ పోస్టర్ లో సంకెళ్ళతో నితిన్ కనిపించాడు. ముందు చెస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో నితిన్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. లవర్ బోయ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నితిన్ చెక్ తో కెరియర్ లో మాస్ ఇమేజ్ కు మరో ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి సినిమాల్లో కథ, కథనాలు గ్రిప్పింగ్ గా ఉంటాయి. తప్పకుండా ఈ చెక్ నితిన్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా ఉంది.  

మనమంతా తర్వాత చంద్రశేఖర్ యేలేటి లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నితిన్ చెక్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రంగ్ దే ఎంటర్టైనింగ్ సినిమాగా రాగా.. అందాదున్ ఎంటర్టైన్ తో పాటుగా ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఇక చెక్ మాత్రం నితిన్ కెరియర్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోగా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: