ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారీన పడుతున్నారు. అందువల్ల షూటింగ్ లకు వెళ్లాలంటే హీరోలు భయపడుతున్నారు. ఇటీవల కరోనా పై జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ నియమాలను అనుసరించి చిత్ర షూటింగ్ లను జరుపుకుంటున్నారు.. ఈ మధ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా చనిపోయారు. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాకు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇలా చాలా మంది కరోనా తో పోరాడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కరోనా వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు..



కాగా, సాయి ధరమ్ తేజ్ కు కరోనా వచ్చిందనే వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.. కరోనా పాజిటివ్ రావడంతో సాయి ధరమ్ తేజ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారని కూడా వదంతులు వచ్చాయి. ఈ వదంతులకు కారణం కూడా ఉంది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రొడక్షన్ పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. సాయి ధరమ్ తేజ్ కు కరోనా రావడం వల్లే డబ్బింగ్ పనుల్లో జాప్యం జరిగిందనే వార్తలు గుప్పు మన్నాయి. అలా అవి తేజు చెవిన పడ్డాయి. 



ఈ విషయం పై తాజాగా స్పందించిన తేజ్.. తనకు ఎటువంటి రోగాలు లేవని, మూడు పూటలా తింటూ చాలా బాగున్నాను అంటూ మండి పడ్డారు. ఒక మనిషికి ఇంక ఎటువంటి పనులు ఉండవా, కొద్దీ రోజులు ఇంట్లో పనులతో బిజీగా ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు రాస్తారా అంటూ నెటిజన్ల పై సీరియస్ అయ్యారు..దర్శకుడు దేవా కట్టతో చేయబోయే తన తరవాత సినిమాకు సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్‌ను తేజు సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.దేవా కట్ట గారు తన రచనతో రక్తి కట్టిస్తున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాం.. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: