యువ హీరో రాజ్ తరుణ్ కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని సక్సెస్ అందుకోవడంలో మాత్రం వెనకపడ్డాడు. ఫ్లాప్ హీరోగా ముద్ర పడినా సరే రాజ్ తరుణ్ చేతిలో ఎప్పుడూ వరుస సినిమాలు ఉంటున్నాయి. లేటెస్ట్ గా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో కూడా పెద్దగా మెప్పించలేదు. ఈ సినిమా తర్వాత సంతోష్ అనే కొత్త కుర్రాడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట రాజ్ తరుణ్.

ఈ సినిమాతో పాటుగా ఒరేయ్ బుజ్జిగా డైరక్టర్ విజయ్ కుమార్ కొండతో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడట. సురేష్ ప్రొడక్షన్ చేస్తున్న డ్రీం గర్ల్ రీమేక్ లో కూడా రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్నాడని తెలుస్తుంది.    

కుర్రాడి స్పీడుగా సినిమాలు ఒప్పుకుంటున్నా సరే వాటికి తగినట్టుగా ఫలితాలు అందుకోవట్లేదు. చేతిలో నాలుగు సినిమాలున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. సంతోష్ అనే నూతన దర్శకుడి డైరక్షన్ లో రాజ్ తరుణ్ చేస్తున్న సినిమాలో అతను స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ కొత్త పాత్రలో రాజ్ తరుణ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. కెరియర్ గ్రాఫ్ పడిపోతున్న టైం లో వరుస సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్ ఇక మీదట కథల విషయంలో కూడా జాగ్రత్త పడతానని అంటున్నాడు. మరి యువ హీరో అనుకున్నది సాధిస్తాడో లేదో చూడాలి.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: