అలా మొదలైంది సినిమాతో డైరక్టర్ గా మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకుని సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్నా తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తుంది లేడీ డైరక్టర్ నందిని రెడ్డి. లాస్ట్ ఇయర్ ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య, నాగ శౌర్యలతో కథాచర్చలు జరుగగా ఫైనల్ గా సమంతతో నందిని రెడ్డి సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

జాను సినిమా తర్వాత సమంతసినిమా కమిట్ అవలేదు. సరైన కథ దొరకడం లేదని చెబుతున్న సమంత మరోసారి నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తుందని అంటున్నారు. అసలైతే సమంత అశ్విన్ శరవణన్ డైరక్షన్ లో ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తాడని అన్నారు. కాని ఏమైందో ఏమో ఇప్పుడు అతని ప్లేస్ లో నందిని రెడ్డి వచ్చి చేరింది. ఇద్దరు కలిసి జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు చేయగా జబర్దస్త్ ఫ్లాప్ అయితే ఓ బేబీ హిట్ అయ్యింది.

మరోసారి సమంతతో నందిని రెడ్డి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో కూడా నటించిన సమంత ఆ వెబ్ సీరీస్ లో విలన్ గా నటించిందని తెలిసిందే. ప్రతి నాయిక పాత్రలను కూడా చేసేందుకు సిద్ధమని హింట్ ఇచ్చేలా వెబ్ సీరీస్ లో ఆ ప్రయత్నం చేసింది సమంత. మరి నందిని రెడ్డితో సమంత హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: