అల్లు అర్జున్ సినిమా అంటే మ్యూజికల్ గా సూపర్ హిట్ అన్నట్టే. అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవడానికి మ్యూజిక్ ఎంత ప్రాధాన్యత్ర వహించిందో తెలిసిందే. థమన్ ప్రాణం పెట్టి చేసిన ఆ సినిమ్నా ఆల్బం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కోసం కూడా అలాంటి ఓ అదిరిపోయే ఆల్బం ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.

అందుకే పుష్ప మ్యూజిక్ విషయంలో చాలా జగ్రత్త వహిస్తున్నారని తెలుస్తుంది. ఈమధ్య దేవి శ్రీ రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అన్న టాక్ ఉంది. కమర్షియల్ హిట్లు పడుతున్నా దేవి రొటీన్ మ్యూజిక్ అనే ముద్ర పడ్డది. ఈ గ్యాప్ లో థమన్ అదరగొట్టేయడంతో అతను ఓ మెట్టు పై ఎక్కాడు. డిఎస్పి సత్తా ఏంటన్నది పుష్పతో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సుకుమార్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.

పుష్పతో సుకుమార్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. రంగస్థలంతో తన మార్క్ చూపించిన సుక్కు అల్లు అర్జున్ తో పుష్ప మరో కొత్త సంచలనానికి సిద్ధమయ్యాడు. తప్పకుండా పుష్ప అంచనాలకు మించి ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా బాలీవుడ్ ఆడియెన్స్ కు కూడా నచ్చేలా ఈ సినిమా  అన్ని అంశాల్లో ది బెస్ట్ గా ఉండాలని చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, దేవి కలిస్తే ఎలా ఉంటుందో మరోసారి పుష్ప సినిమాతో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: