అవునూ.. రియల్ స్టార్ శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "కోతి కొమ్మచ్చి" షూటింగ్ తాజగా మొదలైంది. అయితే ఇంతకీ ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎపుడు రిలీజ్ కానుంది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ "మా "కోతి కొమ్మచ్చి" చిత్రం ఈరోజు నుండి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నేటి నుండి రెండు వారాల పాటు అమలాపురం పరిసర ప్రాంతాల్లో హీరోలు , హీరోయిన్లలతో పాటు రాజేంద్ర ప్రసాద్ , నరేష్ మిగతా తారాగణంపై కొన్ని కీలక సన్నివేషాలు చిత్రీకరించబోతున్నాం. ఆ తర్వాత వైజాగ్ లో మిగతా సన్నివేశాలు తీయనున్నాము. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను" అన్నారు.
అయితే ఈ సందర్బంగా చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. "ఈరోజు నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న మా సినిమా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సతీష్ గారు యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథకు తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలతో క్వాలిటీ సినిమాగా "కోతి కొమ్మచ్చి" ప్రేక్షకుల ముందుకు రానుంది" అన్నారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరో ఒకరు సమీర్ వేగేశ్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న కొడుకు కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: